మా తమ్ముడు గారి అమ్మాయి దురదృష్టవశాత్తు చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోవడంతో నా దగ్గర పెరుగుతుంది. నా తాహతుకు మించి ఆ పాపను నేను అమలాపురంలోని విద్యానిధి పాఠశాలలో చేర్పించాను. నా ఆర్థిక పరిస్థితిని గమనించిన విద్యాసంస్థ అధినేత శ్రీ ఎ.బి. నాయుడు గారు ఈ విషయాన్ని గారపాటి వీర్రాజు మెమోరియల్ ట్రస్టు వారికి తెలియజేయడం, వారు మా పరిస్థితిని కూలంకషంగా పరిశీలించి, మా పాప చి. అరిగెల ఆశ్రిత విద్యా ప్రమాణాలను అంచనా వేసి, 2023 సం.లో అయిదవ తరగతి చదువుతున్న పాపను చదువు నిమిత్తం దత్తత తీసుకుని, పాప చదువుకున్నంత కాలం ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అందించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే రీతిలో మరికొంత మంది విద్యార్థులకు, వారి ఉన్నత విద్య నిమిత్తం ఈ ట్రస్టు ఆర్థిక సాయం అందజేస్తూ తమ వితరణ చాటుకుంటున్నారు. మాలాంటి వారికి ఈ ట్రస్టు అందించే సహకారం అమృతంతో సమానం. వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో అనేక మంది ఈ ట్రస్టు నుండి సహకారం అందుకునే విధంగా ట్రస్టు అభివృద్ధి చెందాలని ఆశిస్తూ.
సర్వే జనా సుఖినోభవంతు,
అరిగెల సతీష్ నాయుడు,
వీరవల్లిపాలెం.


-ARIGELA SATISH NAIDU
అందరికీ నమస్కారములు. నా పేరు లక్కింశెట్టి వెంకటేష్. మాది బండారులంక. మాది చేనేత కుటుంబం. ఆర్థికంగా అంతంత మాత్రమే. మా అమ్మాయి లక్కింశెట్టి వర్షిత ఇంటర్మీడియట్ లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి, ఎంసెట్ లో కూడా మంచి ర్యాంకు తెచ్చుకుంది. వచ్చిన ర్యాంకుతో విజయనగరం MVGR ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించింది. ఇంజనీరింగ్ చదువుకు కావల్సిన ఆర్థిక భారాన్ని నేను మోయగలనా అని ఆలోచిస్తున్న సమయంలో, మా అమ్మాయి పదవి తరగతి చదివిన స్కూల్ హెడ్మాస్టర్ శ్రీ డి. గౌరీ శంకర్ గారి ద్వారా 'గారపాటి వీర్రాజు మెమోరియల్ ట్రస్టు' గురించి తెలుసుకొని వారిని సంప్రదించడం జరిగింది. ట్రస్టు సభ్యులు సానుకూలంగా స్పందించి మా ఇంటికి చేరుకొని మా ఆర్థిక స్థితిని, మా అమ్మాయి విద్యా ప్రమాణాలను పరిశీలించి 2024 సం. లో బిటెక్ మొదటి సంవత్సరానికి ఆర్ధిక సహాయం అందించారు. ప్రతి సంవత్సరం మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే, మిగిలిన మూడు సంవత్సరాలకు కూడా ఇదే విధమైన ఆర్ధిక సహాయం అందుతుందని హామీ ఇచ్చారు. మా అమ్మాయి చదువుకు ఆర్ధిక సహాయం అందిస్తున్న గారపాటి వీర్రాజు మెమోరియల్ ట్రస్టుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మాలాంటి వారి పిల్లల చదువుకు అండగా నిలుస్తున్న ఈ ట్రస్టు పది కాలాల పాటు చల్లగా ఉండాలని భగవంతుడిని వేడుకుంటూ...
లక్కింశెట్టి వెంకటేష్,
బండారులంక.


-Lakkimsetti Venkatesh
అందరికీ నమస్కారం. నా పేరు యాళ్ళ సత్తిబాబు. మాది కొత్తపేట మండలం లోని అవిడి గ్రామం. నాకు ముగ్గురు పిల్లలు. మా పెద్ద పాప చి. మోహన్ శ్రీ వెంకటలక్ష్మి ఇంటర్మీడియట్ లో మంచి మార్కులతో ఉత్తీర్ణురాలై, ఎంసెట్ లో మంచి ర్యాంకు సాధించడంతో భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించింది. రోజు కూలీగా పనిచేస్తున్న నాకు ఈ ఆర్థిక భారాన్ని మోయడం కష్టతరం కావడంతో, నా స్థితిగతులు తెలిసిన శ్రీనివాసరావు మాష్టారు నా అవసరాన్ని 'గారపాటి వీర్రాజు మెమోరియల్ ట్రస్ట్' వారికి తెలియజేయడం జరిగింది. అప్పుడు ట్రస్ట్ సభ్యులు మా ఇంటికి వచ్చి, మా ఆర్థిక పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి, మా అమ్మాయి విద్యా ప్రమాణాలను అంచనా వేసి, 2024 సం.లో బిటెక్ మొదటి సంవత్సరానికి ఆర్థిక సహకారం అందించారు. పాప విద్యా ప్రమాణాలు ఇదే విధంగా కొనసాగితే, బిటెక్ పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం ఇదే రీతిలో ట్రస్ట్ నుండి ఆర్థిక సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మా అమ్మాయి వంటి మరి కొంతమంది ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు కూడా ఈ ట్రస్టు ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ ట్రస్ట్ వారు అందించే సహకారం మాలాంటి వారి పిల్లల చదువుకి ఎంతగానో ఉపకరిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మా అందరి తరపున ట్రస్టు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో అనేకమంది ఈ ట్రస్టు ద్వారా సహకారం అందుకునే విధంగా ట్రస్ట్ అభివృద్ధి చెందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.
యాళ్ళ సత్తిబాబు,
అవిడి.


-Yalla Satti Babu