మా నాన్న గారి జ్ఞాపకంగా,
నా జీవితంలో నేర్చుకున్న గొప్ప పాఠాలలో కొన్ని.. సామాజిక బాధ్యత, ఉన్నదానితో సంతోషంగా జీవించడం, మరియు ముఖ్యంగా పిల్లలకు విలువైన విద్యను అందించడం.. ఇవన్నీ మా నాన్న గారిని చూసి నేర్చుకున్నవే.
నాన్న గారి జీవితం పూర్తిగా ఇతరుల కోసం త్యాగం, స్వార్ధరహిత సేవ, మరియు విద్యపై అపారమైన విశ్వాసంతో నిండినది. ఆయన మాటలు, ఆయన పనులు.. రెండూ మాకు మార్గదర్శకంగా నిలిచాయి.
నేడు, నాపిల్లలకు మంచి చదువును అందించాలనే తపన, వారికి మంచి సంస్కారాలు నేర్పాలనే తపన.. ఇవన్నీ నాన్న గారి స్ఫూర్తితో వచ్చినవే.
సమాజంలో ఎలా జీవించాలి? ఎలా ఆదర్శంగా ఉండాలి? మన జీవితం ఎలా ఇతరులకు ఉపయోగపడాలి? .. .. అనే ప్రశ్నలన్నింటికీ, మా నాన్న గారి జీవితమే ప్రత్యక్ష సమాధానంగా నాకు కనిపించింది.
నా అన్న శ్రీ గారపాటి సూర్యనారాయణ గారు స్థాపించిన 'గారపాటి వీర్రాజు మెమోరియల్ ట్రస్ట్' లో ఒక సభ్యుడిగా భాగస్వామిని కావడం నాకు గౌరవంగా నేను భావిస్తాను.
ఇది మా నాన్న గారి ఆశయాలను కొనసాగించే ఒక చక్కటి మార్గం.
ఈ ట్రస్ట్ ద్వారా ఉన్నత విద్యను సాధించడం కోసం పోరాడుతున్న పేద విద్యార్థులకు సహాయం చేయగల్గటం మా కుటుంబానికి ఒక ఆశీర్వాదంగా భావిస్తున్నాను.
మా నాన్న గారి జీవితం, మాకు మాత్రమే కాదు.. ఈ సమాజానికీ ఒక ఆదర్శం, మార్గదర్శకం.